Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండుతున్న వరి పంటలు
నవతెలంగాణ-చిలుకూరు
24 గంటల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పటమే తప్ప ఆచరణలో మాత్రం జరగడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంగళవారం మండలంలో ఆయా గ్రామాల రైతులు తెలిపిన వివరాల ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారన్నారు అమరారపు సైదులు అనే రైతు తమకున్న మూడెకరాల పొలంలో ఎన్ఎస్పి కాలువ కట్టపై నుంచి విద్యుత్ మోటార్ సహాయంతో మూడెకరాల పొలం సేద్యం చేస్తున్నాడు.విద్యుత్ పగలు ఐదు గంటలు రాత్రి ఐదు గంటలు మాత్రమే ఇవ్వడంతో పగలు తడిసిన ఒక్క ఎకరం మాత్రమే తడిసిన పొలం రాత్రి మళ్ళీ అదే పొలం తడుస్తుంది.మిగతా పొలం తడవకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఎండలు అధికం కావడంతో దీనికి తోడు 24 గంటల విద్యుత్ ఇవ్వకపోవడంతో పొలం ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడుగా ప్రభుత్వ అధికారులు వారబంది నిర్వహించడంతో పొలం పూర్తిగా ఎండిపోయే ప్రమాదంలో పడుతుందన్నారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తూ వారబంధీని తొలగించి యథావిధిగా నీరందించాలని కోరుతున్నారు.