Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మండలంలోని సీతానగరం తండాలో మంగళవారం టాస్కా గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆరె రామకృష్ణారెడ్డి మాట్లాడారు.వృద్ధాప్యంలో వున్న తల్లి తండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు.కనిపెంచిన వారిని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.అనేక కుటుంబాల్లో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకునే దిక్కులేక అనాథలుగా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం పిరికెడు మెతులు వేసే దిక్కులేక ఆకలికి అ లమటిస్తున్నారని తెలిపారు.పేద గొప్ప అనే తేడా లేకుండా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారని గుర్తు చేశారు.తల్లిదండ్రులను పోషించని వారికి టాస్కా అండగా వుంటుందని హామీ ఇచ్చారు.కనిపెంచిన వారిని పోషించకుండా వుండే పిల్లలను చైతన్యపరిచి తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేస్తామని చెప్పారు.ముసలోళ్ళ బాధలను పట్టించుకోని వారిపై ఆర్డీఓ సహకారంతో 2007 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా బానోతుహరిలాల్, ఉపాధ్యక్షులు బి.హరియా, ప్రధాన కార్యదర్శి జూలకంటి కోటిరెడ్డి, సహాయ కార్యదర్శి, బాదావత్ సక్రు,కార్య నిర్వాహక కార్యదర్శి, బాదావత్ లచ్చా,కోశాధికారి,బానోతు లాలుతో పాటు మరో ఆరుగుర్ని కార్యవర్గ సభ్యు లు గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నారాయణ రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల విద్యాసాగర్, సభ్యులు నాగయ్య పాల్గొన్నారు.