Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీ సీతారామ ఫంక్షన్హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.13.56 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 81 మందికి 40 లక్షల రూపాయల చెక్కులను, శ్రీనిధి పథకం ద్వారా 35కోట్లా 80 లక్షలా 49 వేల రూపాయల చెక్కులు అందజేత, కల్యాణలక్ష్మీ పథకం ద్వారా 113 మందికి కోటి 53 లక్షలా13 వేలా 138 రూపాయల విలువగల చెక్కులను ్లలబ్దిదారులకు అందజేశారు.అనంతరం మహిళ ప్రజాప్రతినిధులను, ఉద్యోగస్తులను, ఉత్తమ మహిళలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు,అధికారులు,సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మెన్లు, ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా రక్షణ కల్పించినట్లయితే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తామెక్కడ తక్కువ కాదని అత్యధికంగా దేశాభివద్ధిలో తమ వంతు కషి చేస్తారని మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయావరణలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం కరోనా టైంలో సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ప్రతినిధులకు శాలుశాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, వార్డు కౌన్సిలర్లు సామినేని ప్రమీలరమేష్, గుండపునేని పద్మ నాగేశ్వర్రావు, తీపిరిశెట్టిసుశీలరాజు, లంకెల రమాదేవి నిరంజన్, కర్రి శివ సుబ్బారావు, కోల ప్రసన్నకోటిరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా పట్టణంలోని 31వ వార్డు శ్రీనివాసనగర్‌లో కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమాటీలు మాతంగి నాగమణి, పడిశాల చుక్కమ్మ లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఇరుకుళ్ళ.చెన్నకేశవరావు, కేపీ ఫౌండేషన్ అధ్యక్షులు కొండ్లే రవికుమార్, కేపీ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు యాదా సుధాకర్, పోలిశెట్టి రమేష్,కొండ్లే. చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట: సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమోఘమైనదని మార్కెట్ డైరెక్టర్ సల్మా మస్తాన్ అన్నారు.స్థానిక 37 వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వార్డు ప్రముఖ మహిళలు అయిన అంగన్వాడీి టీచర్స్, ఆయాలు, ఆశా వర్కర్స్, పారిశుద్ధ కార్మికులు, ఏఎన్ఎంలకు సన్మానం చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. సమాజంలో ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలన్నారు.కుటుంబం బాధ్యతలు తీసుకుంటూ విద్య,వైద్యం, అన్ని రంగాలలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజంలో బాధ్యతతో నడుచుకుంటుంన్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, గౌరవింపబడుతున్నారని తెలిపారు. లింగ సమానత్వం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు.అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో పోలగాని మంగమ్మ, నస్రిన్, ఆండాలు, నాగమణి, అంగన్వాడీలు రజిత, రమణ, పుష్పలత సౌమ్య,త్రివేణి, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధరంగాల్లో పని చేస్తున్న పలువురు మహిళలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే అరుణ భారతి, ప్రముఖ న్యాయవాది వూర.గాయత్రి ,తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్ సోంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, మహిళ సబ్ కమిటీ కన్వీనర్ క్రాంతి ప్రభ, సీఐటీయూ,నాయకురాలు చెరుకు ఏకలక్ష్మి, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్.అనిత, కె.రత్నకుమారి,ఎస్. విజిత, పోదిల జ్యోతి, సీనియర్ నాయకులు వి పద్మలీల, బిందులత,అనూరాధ, నారాయణమ్మ, టీఎస్ యుటిఎఫ్ నాయకులు లాలు, శ్రీనివాసచారి, రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలకేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మొండ్రాయి తిరుమలగిరి ఆధ్వర్యంలో ఆరుగురు మహిళలకు శాలువాలు కప్పి మెమొంటోలతో సన్మానించారు.కేక్ కటింగ్ చేసి తోటి మహిళలకు బ్రెడ్స్ ప్యాకెట్స్ పంచారు.ప్లాస్టిక్ కవర్లను నిషేధించి పేపర్ బ్యాగ్స్ పంచారు.టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థికి పరీక్షా ప్యాడ్స్ బహూకరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు జలగం రామచంద్రన్గౌడ్, కార్యదర్శి అయితా శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ సురేష్ కుమార్, లయన్ లేడీ జలగం ఉషారాణి, లయన్ లేడీ మనిషా,లయన్ లేడీ సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ :అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక కౌండిన్యఫంక్షన్హాల్లో పట్టణంలోని మహిళలకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్,సమభవన సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే చేశారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి నియోజకవర్గ పరిధిలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి,ఎంపీడీఓ శాంతకుమారి,శానంపూడిరజిత, కౌన్సిలర్లు దొంగారి మంగమ్మ, గుండా ఫణికుమారి, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు దొంతిరెడ్డి రాంరెడ్డి, అట్లూరి మంజుల, చెవుల కవిత, గూడెపు దీప, స్వప్న, నాగమణి తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శాంతకుమారి, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, ఉపాధిసిబ్బందిని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.
మేళ్లచెర్వు : అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలను స్థానిక మైహోమ్ ఇండిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనగర్ కాలనీలోని మహిళలు ఘనంగా జరుపుకున్నారు.ఈసందర్భంగా లేడీస్క్లబ్ ప్రెసిడెంట్ యన్. అనురాధ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సెక్రెటరీ లావణ్య, జాయింట్సెక్రెటరీ లక్ష్మీ, క్లబ్ మెంబర్స్, కాలనీమహిళలు పాల్గొన్నారు.
తుంగతుర్తి : మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా సాధికారిత సాధించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 7 కోట్లా 28 లక్షలా 30 వేల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించిందన్నారు.శ్రీనిధి ద్వారా రూ.25 కోట్ల మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు.ఈ మేరకు శాఖలో పనిచేస్తున్న మహిళలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్‌రావు, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, మున్సిపల్‌చైర్‌పర్సన్ పోతరాజు రజిని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొమ్మనేని స్రవంతి, నాగారం అర్వపల్లి, తుంగతుర్తి, నూతనకల్ మండలాల ఎంపీపీలు కూరంనాగమణి, గుండగాని కవిత రాములుగౌడ్, మన్నెం రేణుక లక్ష్మీనర్సయ్య, సీడీపీఓ శ్రీజ, హార్టికల్చర్ అధికారి స్రవంతి,బీఆర్ఎస్ నాయకులు రజాక్, నూతనకల్, అర్వపల్లి జెడ్పీటీసీలు కందాల దామోదర్‌రెడ్డి, దావుల వీరప్రసాద్‌యాదవ్, తుంగతుర్తి వైస్‌ఎంపీపీ శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని పద్మశాలిభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాసా జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగు రాష్ట్రాలకు కోఆర్డినేటర్ ప్రేమ్‌కుమార్,ఐసీడీఎస్ సూపర్వైజరు లక్ష్మీ, గొడ్డలి నరసన్న ,మహిళలు మంగమ్మ, ఏకలక్ష్మి, సుజాత,కవిత, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.
మఠంపల్లి: మండలకేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సీఐటీయూ అనుబంధ సంఘం మహిళలకు ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు.ఈకార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి యల్క సోమయ్యగౌడ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను,సీఐటీయూ మండల కన్వీనర్ ఎండి.రన్‌మియా, మండల ప్రధానకార్యదర్శి అమరారపు వెంకటేశ్వర్లు,కోశాధికారి జెడ్ సుజిత, గోవింద్, వెంకటేశ్వర్లు, శాంతమ్మ,పద్మ, కష్ణవేణి,కలమ్మ వెంకటమ్మ,సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.