Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
అనంతగిరి మండలం కిష్టాపురం గ్రామ సర్పంచ్ లక్ష్మాల జానమ్మ వెంకటప్పయ్య గ్రామ అభివద్ధిలో భాగంగా చేసిన సేవలకు గాను జిల్లా ఉత్తమ గ్రామ సర్పంచ్‌గా ఎంపికయ్యారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కోదాడ పట్టణంలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. కిష్టాపురం గ్రామం అన్ని రకాలుగా అభివద్ధి పథంలో తీసుకెళ్లడంలో సర్పంచ్ చేసిన కషికి గాను అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ జానమ్మ వెంకటప్పయ్య మాట్లాడుతూ గ్రామాన్ని అభివద్ధి చేయటంలో గ్రామ ప్రజలు, ఎమ్మెల్యే బొల్లంమల్లయ్యయాదవ్, పంచాయతీ కార్యదర్శి సహకారం మరువలేనిదన్నారు. జిల్లా ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు పొందడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.