Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్ట్రిషియన్ టెక్నిషియన్ లాస్టియర్ చదివే విద్యార్థులకు అవకాశం కల్పించాలి
నవతెలంగాణ-సూర్యాపేట
జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు ఈటీ (ఎలక్ట్రికల్ టెక్నీషియన్) కోర్స్ చదువుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసే అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ డిమాండ్‌చేశారు.బుధవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అభ్యర్థులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు.జూనియర్ లైన్మెన్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఈటీ కోర్స్ ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థులకు కూడా అర్హుత కల్పించే నోటిఫికేషన్ సవరించాలన్నారు.ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఈ పోస్టులకు డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఉన్నత చదువులు చదివిన యువకులు కూడా జేఎల్ఎం ఉద్యోగాల కోసం ఇంటర్మీడియట్లో ఈటీ (ఎలక్ట్రికల్ టెక్నీషియన్) కోర్స్ చదువుతున్నారని తెలిపారు.వారికి మార్చి 15 నుండి 24వ తేదీ వరకు కోర్సు పూర్తి అవ్వడానికి పరీక్షలు ఉండగా, సర్టిఫికెట్ రావడానికి 25 రోజులు సమయం పడుతుందన్నారు.అలాగే మార్చి 8 నుండి 28వ తేదీ వరకు జేఎల్ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు. కావున కేవలం 25 రోజుల వ్యవధిలోనే ఉద్యోగాలకు అవకాశం లేకుండా నిరుద్యోగ యువత నష్టపోయే అవకాశమున్న ందున సంబంధిత మంత్రి జోక్యం చేసుకొని వారికి అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అభ్యర్థులు సురేష్, శ్రీకాంత్, మహేష్, అరవింద్, గోపిచందు, సైదులు, చంటి, శంకర్, భార్గవ్, చంటి, జగన్, భిక్షం తదిరులు పాల్గొన్నారు.