Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృటిలో తప్పిన ప్రాణాపాయం
నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా మూడు రోజులుగా జరుగుతున్న సీతారామాంజనేయ ప్రతిష్ఠ కార్యక్రమంలో చివరి రోజైన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో అపశతి చోటుచేసుకుంది.క్రేన్ల సహాయంతో ధ్వజస్తంభం ఎత్తే క్రమంలో క్రేన్ అదుపుతప్పి ఒకవైపుకు వంగడంతో పక్కనే ఉన్న జన సమూహంపై పడే సమయంలో గుడికి పక్కగా నిర్మించిన ప్రహరీపై ధ్వజస్తంభం పడడంతో విరిగింది.దీంతో ప్రాణాపాయం తప్పింది.దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే సంఘటనాస్థలంలో అందుబాటులో ఉన్న ఎస్సై వెంకన్న,పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను, భక్తులను ఇండ్లలోకి పంపించారు.ధ్వజ స్తంభం విరగడంతో గ్రామానికి వచ్చిన బంధువులు బాధను వ్యక్తం చేశారు.