Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యక్రమానికి పిలిచి అవమానించారని ఆవేదన
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మహిళలను గౌరవించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే పెన్‌పహాడ్ జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్యకు అవమానం ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ పథక ప్రారంభాన్ని వైద్యాధికారి స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా డాక్టర్ తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించగా తాను సకాలానికి హాజరయ్యాయన్నారు. కాగా తనకు ఉత్తమ జెడ్పీటీసీ అవార్డు వచ్చిందని అవార్డు తీసుకోవడానికి సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావాలని ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని వెళ్తానని డాక్టర్‌కు తెలియజేయగా ఎంపీపీ కార్యక్రమాన్ని కొంత సేపు ఆపాలని చెప్పారన్నారు.అప్పటివరకు ఆగాలని లేకుంటే వెళ్లొచ్చని తనను అవమానిచడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంతా జరుగుతుంటే కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు తహసీల్దార్, ఎంపీడీివో ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాక గ్రామాల్లో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని తాను హాజరైన కార్యక్రమాన్ని ఎంపీపీ కావాలని ఆలస్యం చేవారన్నారు.తాను హాజరు కానీ చోట కార్యక్రమాన్ని త్వరగా ముగించి కార్యక్రమం పూర్తి చేసి కావాలని తనను అవమానిస్తున్నారని ఆరోపించారు.ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతున్నట్లు తెలిపారు.