Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగానికి పాల్పడుతున్న బీజేపీ
- దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఇచ్చిన నోటీసులు కావు
- రాజకీయ దురుద్ధేశంతో కవితకు నోటుసులు
- మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లింది
- రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులివ్వడమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.బుధవారం జిల్లాకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది చక్కటి నిదర్శనమన్నారు.దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరిపి నోటీసులు ఇచ్చినట్లు లేదని, రాజకీయ దురుద్ధేశంతోటే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.బీజేపీకి చెందిన ఓ ఎంపీ చేసిన ఆరోపణలను బేస్ చేసుకునే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం బహిరంగ రహస్యమేనని ఆయన వెల్లడించారు.బీజేపీ పాలకులకు కంట్లో నులుసుగా మారిన ఢిల్లీలోని ఆప్, తెలంగాణాలోని బీ ఆర్ఎస్ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే కుట్రలో భాగమే ఇది అని ఆయన స్పష్టం చేశారు.తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతియ్యాలన్నది మోడీ సర్కార్ యోచనగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి పప్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉడకవన్నారు.నియంతలు ఎప్పుడూ నిలబడిన దాఖలాలు లేవని,ప్రపంచంలో అంతం కాబడిన నియంతల కంటే మోడీ గొప్పోడు కాడని చెప్పారు.ఇటువంటి కేసులతో బీఆర్ఎస్ను నిలువరించాలనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరోటి ఉండబోదని ఉండదని బీజేపీ నేతలకు చురకలు అంటించారు. మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లిందని,బీజేపీ సర్కార్‌ను గద్దె దింపే వరకు పోరాటం ఆగదని హచ్చరించారు.కేసులు,జైళ్లు మాకు కొత్త కాదని తేల్చిచెప్పారు.ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇటువంటి కుట్రలను ఛేదించడం కష్టతరం కాబోదన్నారు.తెలంగాణా రాష్ట్ర సాధన కోసం 2001లో ఉద్యమం మొదలు పెట్టిన రోజునే వీటికి సిద్ధమై ముందుకు సాగినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలో రాష్ట్రం అవిర్బావించిందని గుర్తు చేశారు.