Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
అంతరాష్ట్ర నకిలీ బంగారం విక్రయ ముఠా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.అరెస్టుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.అంతర్ రాష్ట్ర నకిలీ బంగారం విక్రయ అరెస్ట్ బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో తుంగతుర్తి ఎస్ఐ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా అన్నారం గ్రామ ఎక్స్ రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక ఆడమనిషి ఇద్దరు మగ వ్యక్తులు కనిపించగా వారిని పట్టుకుని విచారించారు.వారు గుంజు పద్మ అలియాస్ జయమ్మ భర్త పుల్లారావు కులము వడ్డెర వత్తి కారం మిషన్, కుంచాల శ్రీను తండ్రి కొండలు కులం వడ్డెర వత్తి లారీడైవర్.వీరిద్దరిది రెంటపల్లి సత్తెనపల్లి మండలం జిల్లా పల్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బత్తుల విజరు వడ్డెర వత్తి మేస్త్రి చామర గ్రామం అచ్చంపేట మండలం పలనాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.వీరంతా 20 రోజుల కింద తాము కుటుంబ సభ్యులమని చెప్పి వెలుగుపల్లి గ్రామంలో పగడాల సోమయ్య ఇంట్లో ఒక గది కిరాయికి తీసుకున్నారు.అర్వపల్లి గ్రామంలో సుతారి పని చేస్తున్నామని నమ్మించి చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఫిబ్రవరి 21,23లలో గుంజి పద్మ బత్తుల విజయులు భర్త భార్యల మాదిరిగా మోటార్ సైకిల్ పై మద్దిరాల గ్రామానికి వెళ్లి ఎరకలి సైదులుకు మాయ మాటలు చెప్పి నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం అని నమ్మిన సైదులు భార్య మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించారు ఫిబ్రవరి 24న గుంజి పద్మ,బత్తుల విజయలు ఇద్దరూ అక్క తమ్ముడు మాదిరిగా వెలుగుపల్లి గ్రామానికి చెందిన తూము లక్ష్మి ఇంటికి వెళ్లి బంగారం ఇచ్చి రూ.1,80,000 తీసుకున్నారు.మార్చి 6న గుంజి పద్మ, కుంచాల శ్రీను ఇద్దరు అర్వపల్లి మండలం బొల్లంపల్లి శివారులో సపోటా పండ్లు అమ్ముతున్న గద్దగూటి వీరమ్మకు మాయమాటలు చెప్పి నకిలీ బంగారం ఇచ్చి రూ.50 వేలు తీసుకున్నారు. ఆ తర్వాత వేరొక దొంగల ముఠా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పత్తి రాజపురం గ్రామానికి చెందిన నక్క ముత్తయ్య. డబ్బా యాకోబు వీరిద్దరూ కలిసి ఒక ముటాగా ఏర్పడి తక్కువ బంగారానికి ఎక్కువ బంగారం ఇస్తామని నమ్మించి వారి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని ప్రజలకు ఇచ్చి తనిఖీ చేసుకోమని చెప్పి తిరిగి రెండు రోజుల తర్వాత వెళ్లి నకిలీ బంగారాన్ని ఇచ్చి డబ్బు బంగారం దోచుకుంటున్నారని తెలిపారు దీంతో తాము మోసపోయామని తుంగతుర్తి, మద్దిరాల, అర్వపల్లి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.ఈ క్రమంలో తనిఖీలో వారిని పట్టుకుని విచారించగా దొంగలను తేలడంతో వారి వద్ద నుండి రూ 3.30లక్షల నగదుతో పాటు నాలుగున్నర తులాల బంగారం, మూడు కేజీల నకిలీ బంగారం ముద్దలు, 5 సెల్ ఫోన్లు రెండు బైక్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్, తుంగతుర్తి, మద్దిరాల ఎస్సైలు డానియల్, వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగరాజు, విజరు, వెంకటేశ్వర్లు కేసును చేధించారని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు.