Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది కంటే రూ.1.50 కోట్లు తగ్గిన బడ్జెట్
- అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
- తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం గురువారం మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిశోర్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీ లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రోడ్డు వెడల్పు లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు చేయాలని విద్యుత్ ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టాల్సిన పనులపై పబ్లిక్ హెల్త్ ఎస్ఈ, ఆర్అండ్ బీ డీఈ, ఇరిగేషన్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పాలకవర్గానికి ఎమ్మెల్యే ఐడెంటీకార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, కారుపోతుల శిరీష, లెంకల సుజాత, ఎర్రవెల్లి యాదమ్మ, మలిపెద్ది రజిత, వనం స్వామి, దబ్బెటి విజయ, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గుర్రం కవిత, కూరెళ్ల కుమారస్వామి, కోఆప్షన్ మెంబర్లు గనగానినర్సింహ, పోలినేని ఆనందమ్మ, ఎండి.షాహిన్ సుల్తాన, మున్సిపల్ కమీషనర్ సి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రూ.19.45 కోట్లతో మున్సిపల్ బడ్జెట్
మోత్కూరు మున్సిపాలిటీ 2023-24ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ సి.శ్రీకాంత్ రూ.19 కోట్ల 45లక్షల 38 వేలతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఖర్చూ అంతే ఉంటుందని అంచనా వేశారు. మున్సిపాలిటీకి ఆదాయంగా పన్నుల ద్వారా రూ.1.40 కోట్లు, రెంట్ల ద్వారా రూ.19.18 లక్షలు, పారిశుధ్య విభాగం నుంచి రూ.14లక్షలు, టౌన్ ప్లానింగ్ ద్వారా రూ.72లక్షలు, ఇంజనీరింగ్ విభాంగం నుంచి రూ. 64.50లక్షలు, డిపాజిట్, రుణాల ద్వారా రూ.10లక్షలు, ప్రణాళికేతర నిధులు రూ.1.88 కోట్లు, ప్రణాళికా నిధులు రూ.62లక్షలు, ఇతర నిధులు రూ.13.75 కోట్లు, మొత్తం రూ.19కోట్ల 45క్షల నిధులు వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేశారు. ఖర్చుల కింద సిబ్బంది వేతనాలు రూ.1.49 కోట్లు, పారిశుధ్య,నిర్వహణకు రూ.52.20లక్షలు, కరెంట్ బిల్లుల చెల్లింపుకు రూ.కోటి, హరితహారంకు రూ. 30.97లక్షలు, నిర్వహణ ఖర్చు రూ.52.20లక్షలు, పరిపాలనా ఖర్చు రూ. 33.84 లక్షలు, టౌన్ ప్లానింగ్ ఖర్చు రూ.50లక్షలు, అభివృద్ధి చెందని ప్రాంతాల అభివృద్ధి కోసం రూ. 4.88లక్షలు, ప్రజా సౌకర్యాల కల్పనకు రూ.5 లక్షలు, వార్డుల వారీగా ఖర్చు రూ.4.76లక్షలు, డిపాజిట్, లోన్స్ రూ.10లక్షలు, ప్రణాళికేతర నిధులు రూ. 1.88కోట్లు, ప్రణాళికా నిధులు రూ. 62 లక్షలు, ఇతర నిధుల కింద రూ.13.75 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. రూ.19.45 కోట్ల ఆదాయ, వ్యయాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కాగా గత సంవత్సరం రూ.21.06 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.1.50 కోట్ల మేర తగ్గింది.