Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని నడిపించాల్సిన వ్యక్తి ఆకస్మికంగా మరణించడంతో ఆ కుటుంబం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోతుంది.. కానీ.అదే వ్యక్తి ముందు చూపుతో వ్యవహరించిన తీరు ఆ కుటుంబానికి అండగా ఉండేలా చేసింది.వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన గుణగంటి శ్రీకాంత్ యాదగిరి గుట్ట యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నుండి 16 లక్షల గృహ రుణాన్ని పొందాడు. దాంతోపాటు 33 వేల ప్రీమియం చెల్లించి స్టార్ యూనియన్ డై లైఫ్ (ఎస్ యు డి)సంపూర్ణ లోన్ సురక్ష పాలసి కూడా తీసుకున్నారు. పాలసీ తీసుకున్న శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం సహజ మరణం పొందారు. బ్యాంక్ అధికారులు కొద్ది నెలలుగా నెలవారి వాయిదాలు కట్టకపోవడంతో మృతుని కుటుంబానికి ఫోన్ చేశారు. పాలసీదారు శ్రీకాంత్ చనిపోయాడని ఆ కుటుంబ సభ్యులు తెలపడంతో వెంటనే ఎస్యుడి లైఫ్ టీం శ్రీకాంత్ కుటుంబానికి సంప్రదించి ఇంటికి సంబంధించిన మొత్తం గృహ రుణం 16 లక్షలను 30 రోజుల్లో సెటిల్ చేసి మృతుని భార్య గుణగంటి మౌనికకు మాఫికి సంబంధించిన ఒప్పంద పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులకు మృతుని కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. మృతుడికి కుమారుడు , కుమార్తె ఉన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ నాగరాజు ,ఎస్యుడి టీంకే శ్రవణ్ , బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ సత్తయ్య ,సిబ్బంది పాల్గొన్నారు.