Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమమని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్ధానిక సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ అన్నారు. గురువారం కంటి వెలుగు కార్యక్రమం ముగిసిన సందర్భంగా వైద్యులను, సిబ్బందిని, ఏఎన్ఎం, ఆశా వర్కర్లను గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 19న ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నేటితో ముగిసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంను ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ2 యండి. రెహన్, డాక్టర్ నరేందర్ కుమార్, డాక్టర్ పర్వేజ్, వార్డు సభ్యులు లెంకల జ్యోతి ప్రవీణ్, గోలుసుల. ప్రసాద్, ఏటేల్లి సునీత శ్రీనివాస్, కొమ్ము. సుష్మితా శేఖర్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.