Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రాజాపేట
ఈడీ, మోడీల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు బెదిరే ప్రసక్తే లేదని రజక సంఘం రాష్ట్ర నాయకుడు సట్టు తిరుమలేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఉనికి చాటుకోవడం కోసం తెలంగాణ నాయకుల పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందన్నారు. ఈడీ, మోడీలకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు తల వచ్చేదే లేదని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం కన్నెర్రజేేస్తే బీజేపీ మాడి మసైపోతుదని హెచ్చరించారు. కల్వకుంట్ల కవితక్క ఒక్క పిలుపునిస్తే లక్షలాదిమంది అభిమానులు తరలివస్తారన్నారు. కవితపై కక్షపూరితంగా కేసులు పెట్టి ఇరికించాలని బీజేపీ చూస్తోందన్నారు. రాబోయే కాలంలో ఢిల్లీ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎర్రగోగుల జశ్వంత్,జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ సందిల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.