Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని రామన్నపేట, సిరిపురం, నిర్నేముల, దుబ్బాక గ్రామాలలో ఉద్దీపన ఫౌండేషన్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సమకూర్చిన చీరలను గురువారం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఆశావర్కర్స్ కు, ఏఎన్ఎం లకు, పారిశుధ్య కార్మికులకు అందజేశారు. ఈ కార్యకవ ుంలో సర్పంచ్ శిరీష పృథ్వీరాజ్, దుబ్బాక ఎంపీటీసీ మాడురి జ్యోతి, న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, సిరిపురం పద్మశాలీ సంఘం ప్రధానకార్యదర్శి రాపోలు రమేష్, ప్రైవేట్ బస్సు యాజమాన్యం సంఘం అద్యక్షులు ఎల్లా సంతోష్ రెడ్డి, నిర్నేముల వార్డు సభ్యులు నోముల ప్రవీణ్ కుమార్, నాగటి మహేష్, సుర్వీ సతీష్, యూత్ నాయకులు నోముల విష్ణు, సుర్వీ నవీన్, బతిని ఉపేందర్, నోముల సైదులు, చంటి, మోతె మల్లేశం, అప్పం గణేష్, గాదె యాదయ్య, శివరాత్రి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.