Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాండు
నవతెలంగాణ-హుజూర్ నగర్టౌన్
సీఐటీయూ కార్యాలయ ఆస్తి అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, సదరు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై, సహకరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం), సీఐటీయూ, ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ కార్యాలయ ఆస్తిని ఏవిధంగా రోశపతి బంధువు వెంకన్నకి అసైన్మెంట్ ఇచ్చారని కమిషనర్‌ను నిలదీశారు. అంతేగాక ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనకు క్రింది స్థాయి సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చారని వారిపై శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతామని హామీ ఇచ్చారు. తనకు తప్పుడు సమాచారం ఇచ్చిన కిందిస్థాయి సిబ్బంది పేర్లు ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. అనంతరం సీఐటీయూ కార్యాలయ ఆస్తిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి, కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి ఎలక సోమయ్యగౌడ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మ కొమ్మ, యోనా, రేపాకుల మురళి, సీనియర్ నాయకులు పాశంవెంకట్ నారాయణ, పిట్టలనాగేశ్వరరావు, శీలం సాంబయ్య, చింతకుంట్ల వీరయ్య, రేపాకుల వెంకన్న, అభిమల్ల జనార్ధన్, రేపాకుల వీరస్వామి, పాశం వీరబాబు, పిన్నపరెడ్డి వెంకటరెడ్డి, నక్కినబోయిన శంబయ్య, షేక్, అహ్మద్, వెంకన్న, దుగ్గిసాయి, గుండు సైదులు, చింతకాయల శ్రీను, ములకలపల్లి శీను ,వీర నాగేశ్వరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.