Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ సివిల్ జడ్జి శ్యామ్‌కుమార్
నవతెలంగాణ-హుజూర్నగర్
సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీ లేనిదే సృష్టి లేదని సీనియర్ సివిల్ జడ్జి శ్యామ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక న్యాయస్థానంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనేది ముమ్మాటికి వాస్తవమన్నారు. బాలికల సంరక్షణ కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ప్రకారం అనేక రకాల చట్టాలు చేయబడ్డాయని, ఈ చట్టాల ద్వారా మహిళలను ఎవరైనా ఇబ్బంది పెట్టిన వేధించిన కఠిన శిక్షలకు గురికాక తప్పదని హెచ్చరించారు. జూనియర్ సివిల్ జడ్జి సాకేత మిత్ర మాట్లాడుతూ అనాది కాలం నుండి స్త్రీలను స్త్రీ దేవతల మూర్తులను పూజించే ఏకైక దేశం భారతదేశం అన్నారు. లింగ వివక్షతకు ఎవరైనా పాల్పడి గర్భస్రావం చేస్తే కఠిన శిక్షలకు గురికాక తప్పదని హెచ్చరించారు. నేడు మహిళలు మారుతున్న పరిస్థితులలో అన్ని రంగాలలో తమ ప్రతిభాపాటవాలను చూపుతూ ముందుంటున్నారని మునుముదు కూడా ఇదే స్ఫూర్తిని మహిళలు కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ విజయలక్ష్మిని, మహిళ న్యాయవాదులు సుంకరి ప్రదీప్తి, పార్థబోయిన మౌలికలను న్యాయమూర్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకట్‌రెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి కాలువ శ్రీనివాసరావు, ఏజీపీ ముప్పాళ్ళ గోపాల కృష్ణమూర్తి, న్యాయవాదులు చనగాని యాదగిరి, రవికుమార్, కృష్ణయ్య, మీసాల అంజయ్య, రాఘవరావు, కొట్టు సురేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.