Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
విద్యార్థులు సీపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలని గాయత్రి నర్సింగ్ అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ,పీజీ కళాశాలలో గాయత్రి నర్సింగ్ హోమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు సీపీిఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనప్పుడు 6 నిమిషాల లోపల ఆక్సిజన్‌ను మెదడుకు చేరవేయడం కోసం సీపీఆర్ ను30 సార్లు చేయాలన్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలలో ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని, క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. అనంతరం నమూనాగా సిపిఆర్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పెసర జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ తన్నీరు ఉపేందర్, డాక్టర్ రమేష్ నాయక్, విద్యార్థి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్, చల్లా రామారావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.