Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాలను వ్యతిరేకంగా ఏప్రిల్ 5న ఢిల్లీలో నిర్వహించే దర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అద్యక్షులు బుర్రి శ్రీరాములు కోరారు. గురువారం పార్టీ కార్యాలయంలో సీఐటీయు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల, మండల సంయుక్త విస్తత స్థాయి సమావేశం రైతు సంఘం మండల అధ్యక్షులు చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. కార్మిక రైతు వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 5న ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, రైతు సంఘం మండల కార్యదర్శి దేశీరెడ్డి స్టాలిన్ రెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్ బచ్చలకూర స్వరాజ్యం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎస్కే.సైదా, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆరెరామ కృష్ణారెడ్డి, సోమపంగి, జానయ్య, కేవీపీఎస్ నాయకులు నందిగామ సైదులు, మల్లారెడ్డి రామకృష్ణారెడ్డి, నాగరాజు, కిన్నెర వెంకన్న, పాల్గొన్నారు.