Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి సమిష్టిగా కృషి చేయాలని తహసీల్దార్ రాంప్రసాద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి పునాది అని ,ఉద్యోగ బాధ్యతను కర్తవ్యాన్ని మరవద్దన్నారు. అంతకు ముందు మండలవిద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని స్టడీ అవర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు యూనిఫామ్ కాకుండా కలర్ డ్రెస్సులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జగ్గు నాయక్ ,ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొండగడుపుల యాకయ్య, గురువయ్య గిరిజన సంక్షేమ కళాశాల ప్రిన్సిపాల్ దుర్గాభవాని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హసీనా మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.