Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట రూరల్:రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ, బీరవోలు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీడీ బిక్షం అన్నారు. గురువారం మండల పరిధిలోని పులగం వారి గూడెంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడ్ను, గ్రామ సర్పంచ్ పులగం స్వాతి రాఘవరెడ్డి ,వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ,క్యాంపు మెడికల్ అధికారి డాక్టర్ విజయ, సూపర్వైజర్లు ఫయాజ్, రాజకుమార్ ,ఉప సర్పంచ్ తొట్ల నాగరాజు ,కార్యదర్శి ఉమా, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ,అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : పట్టణంలోని 8వ వార్డులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం స్థానిక కౌన్సిలర్ శాగంటి అనసూయ రాములు ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలోడాక్టర్ మల్లెల వందన , సిహెచ్ఓ మలోతు బిచ్చు నాయక్, ఎమ్ ఎల్ హెచ్ పి ప్రవలిక, సంధ్యారాణి,పూర్ణ శేఖర్, విజయ్, దనమ్మ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.