Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని 18 వ వార్డులో నెలకొని ఉన్న డ్రెయినేజీ, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం పట్టణంలోని 18వ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రెయినేజీ సమస్యలు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అనారోగ్యాల గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ వెంటనే స్పందించి డ్రయినేజీతో పాటు పరిసరాల అపరిశుభ్రత సమస్యలను పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారా యణ తదితరులు పాల్గొన్నారు.