Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు లింగయ్య మృతి బాధాకరమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సింగారెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఖమ్మంపాటి లింగయ్య బుధవారం అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురువారం ఆయన అంతిమయాత్ర గ్రామంలో కొనసాగగా ఎంపీపీ నెమ్మాది బిక్షం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు పాల్గొని మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనే వాడని ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో ముందంజలో ఉండి పలుసార్లు పార్టీ విజయం కోసం కృషి చేశారన్నారు. లింగయ్య కుటుంబానికి పార్టీ అండదండలు ఎల్లవేళలా ఉంటాయని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ అంతిమయాత్రలో సర్పంచ్ షేక్ షరీఫుద్దీన్, జిల్లా నాయకులు తూముల ఇంద్రసేనారావు, వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, బిట్టు నాగేశ్వరరావు, చెన్ను శ్రీనివాసరెడ్డి, గుగ్గిళ్ళ సోమయ్య, పొదిల నాగార్జున, యగ్గడి మురళి, మల్లయ్య, పేర్ల శ్రీధర్, జూలకంటి వెంకటరెడ్డి ,రామచంద్రారెడ్డి, మైసయ్య, పాండురంగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.