Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
నాణ్యమైన విద్యను అందించడం,విద్యార్థులు హాజరు శాతాన్ని మెరుగుపరచడం,పాఠశాలల్లో మౌలికవ సతుల కల్పనకోసం మనఊరు-మనబడి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మనఊరు-మనబడి పథకం ద్వారా మంజూరైన 34 లక్షలతో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అధునాతన వసతుల పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నకిరేకంటి విజరు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య,జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,ఎస్ఎంసి చైర్మన్ బుద్ధ అంజయ్య,గొట్టిపర్తి ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు వగలగాని లింగయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హస్రా పర్వీన్,తదితరులు పాల్గొన్నారు.