Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేల రాలుతున్న విద్యార్థులు, యువకులు కరోనా టీకానే కారణమా?
నవతెలంగాణ-నల్లగొండ
పదహారేండ్ల వయస్సులోనే గుండెపోటు, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే కుప్పకూలిన ఇంటర్ విద్యార్ధి, ఖమ్మంలో విషాదకర ఘటన.. ఆస్పత్రికి తరలించేలోపే మతి. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి రాకేశ్ మతి చెందాడు. రాకేశ్ తన ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నేహితులు రాకేశ్‌ను ఆస్పత్రికి తరలించేలోపు రాకేశ్ మతి చెందాడు. గుండెపోటుతోనే రాకేశ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద అనే డిఫరెన్స్ లేదు..వయసుతో సంబంధమే లేదు. అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు ఎవరినీ వదలడం లేదు. ఉన్నటుండి సడెన్‌గా హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతే, కుప్పకూలిపోతాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోతాడు. ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలోనే విద్యార్థి విశాల్ గుండెపోటుతో మతి చెందడం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి రాకేశ్ మతి చెందాడు. రాకేశ్ తన ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నేహితులు రాకేశ్‌ను ఆస్పత్రికి తరలించేలోపు రాకేశ్ మతి చెందాడు. గుండెపోటుతోనే రాకేశ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దేశంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పని చేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్లే క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళనకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సర్వ సాధారణం. కానీ, ఏ కారణం లేకుండానే కొన్ని సెకన్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, తరుచూ అలా జరగడం గుండెపోటు లక్షణంగా చెబుతున్నారు డాక్టర్లు. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ మరణాలకు కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలేవీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కొన్ని వారాల పాటు దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని, కోవిడ్ -19 వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండెపోటుకు చిన్న పెద్ద లేదు
డాక్టర్ పీ. శ్రీధర్ (ఎండీ, డీఎం, కార్డియాలజి సురక్ష హాస్పిటల్)
గుండెపోటుకు చిన్న పెద్ద లేదు. ఆధునిక జీవితంలో బిజీ లైఫ్ షెడ్యూల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు వేగంగా విస్తరిస్తోంది. గతంలో గుండె జబ్బులు వద్ధాప్య సమస్యగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా యువకులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గుండెకు రక్త ప్రసరణ ఆగినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండె నాళాలలో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఒక రకమైన అడ్డంకులు ఏర్పడతాయి. మనం ప్రతిరోజూ తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తుంటాం. దాని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని గురించి ప్రజలందరూ తెలుసుకోవడం, నివారించడం ముఖ్యం. మన అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
కరోనా టీకా వల్ల గుండెపోటు రాదు
డాక్టర్ కొండలరావు (డీఎంహెచ్ఓ, నల్లగొండ )
కరోనా టీకా వల్ల గుండెపోటు వస్తుంది అనడం అబద్ధం. ఊబకాయం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. బరువును సకాలంలో అదుపులో ఉంచుకుంటే ఈ సమస్యలన్నింటిని పరిష్కరించవచ్చు. ధూమపానం చేసేవారు, అధిక ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిజానికి, ధూమపానం వల్ల ధమనులలో ఒక రకమైన పదార్థం అడ్డుగా ఏర్పడుతుంది. దీని వల్ల ధమనులు సంకుచితమై గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఏ పనిచేయకుండా ఉన్నప్పుడు ధమనులలో కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. మీ గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనులు దెబ్బతిన్నట్లయితే అది గుండెపోటుకు దారి తీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.