Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి నడిచే ఆర్టీసీ బస్సును తిరిగి ఆర్టీసీ అధికారులు పునరుద్ధరించారు. గ్రామానికి గత కొన్నేండ్లుగా నడిచిన బస్సును రెండేళ్ల క్రితం రద్దు చేయడంతోపాలడుగుతో పాటు సుమారు నాలుగైదు గ్రామాల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు రద్దు చేయడంతో ప్రయాణికులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామ సర్పంచ్ మరిపెల్లి యాదయ్య, ఉప సర్పంచ్ ఎడ్ల భగవంతు, ఎస్సీ స్టూడెంట్ హాస్టల్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపెల్లి రాజ్ కుమార్ ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ శ్రీదేవి, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి బస్సును పునరుద్ధరించాలని కోరారు. యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ ప్రజల వద్దకు ఆర్టీసీకార్యక్రమాన్ని పాలడుగు గ్రామంలో నిర్వహించి గ్రామానికి బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. బస్సును పునరుద్ధరించడం పట్ల సర్పంచ్ యాదయ్య, ఉపసర్పంచ్ భగవంతు, కొంపెల్లి రాజ్ కుమార్ ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.