Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
స్థానిక మైహోమ్ ఇండిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్లో శుక్రవారం ఘనంగా 52వ జాతీయభద్రతావారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి మాట్లాడారు.మైహోమ్ పరిశ్రమల్లో చేపడుతున్న భద్రత నియమాలు, భద్రతకు సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా పనిచేసిన కార్మికులకు, ఉద్యోగులకు, యాజమాన్యానికి ఆమె అభినందనలు తెలిపారు.జాతీయ భద్రతా కౌన్సిల్, సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్టరీ,కర్మాగారాల శాఖ సంయుక్తంగా ప్రతిఏడాది మార్చి 4న జాతీయ భద్రత జరుపుకుంటామన్నారు.కర్మాగారంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు యాజమాన్యం అందించిన సేప్టీ పీపీఈని ధరించి పరిశ్రమల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పనిచేయాలన్నారు. అలాగే ఈఏడాది జాతీయ భద్రతా మండలి ఇచ్చిన తీమ్ మన లక్ష్యం హాని రహితం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.ఈ సందర్భంగా సంస్థ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులు,ఉద్యోగుల భద్రత కోసం సంస్థ నిరంతరం పనిచేస్తుందన్నారు.భద్రత కోసం సంస్థ ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఖర్చు చేస్తుందని తెలిపారు.ఈసందర్భంగా మైన్స్, మెకానికల్, సీపీపీ ఫ్యాకింగ్ ప్లాంట్ ఉద్యోగులు చేసిన భద్రత స్కీట్స్ అందర్ని ఆకట్టుకున్నాయి.వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన ఉద్యోగులు, కార్మికులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో సేప్టీ డీజీమ్ సూర్యానారాయణ, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.