Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
- రాచకొండ కమిషనర్ డీఎస్.చౌహాన్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా పండుగలు జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ డీఎస్. చౌహాన్ అన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి , రంజాన్ మాసం పర్వదినం ప్రారంభం సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్పిన జాగ్రత్తల గురించి శుక్రవారం నేరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో రాచకొండ డీసీపీలు, ఏసిపిలు, ఇతర అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్నో మతపరమైన సున్నిత ప్రదేశాలు ఉన్నాయని వివిధ పండుగల రోజున, మతపరమైన ఊరేగింపుల సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలనిన్నారు. అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పాత నేరస్తుల మీద నిఘా వేసి ఉంచాలని, వారు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి, డిసిపి మల్కాజ్ గిరి ధరావత్ జానకి, డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర , రోడ్ సేఫ్టీ డీసీపీ శ్రీ బాల, డీసీపీ మురళీధర్, డీసీపీ గిరిధర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, డీసీపీ ఎల్బి నగర్ సాయి శ్రీ, అదనపు డీసీపీ అడ్మిన్ ఇందిరా దేవి, అదనపు డీసీపీ షమీర్, ఏసిపి జావేద్ , ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, తదితరులుు పాల్గొన్నారు.