Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మహబూబ్ నగర్ -రంగారెడ్డి -హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాణిక్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మాణిక్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ మండలంలోని జిల్లా పరిషత్ తుక్కాపూర్, బండ సోమవారం, చందుపట్ల, కూనూరు,రాయగిరి , బస్వాపూర్ , తిమ్మాపూర్ , హన్మాపూర్, అనంతారం పాఠశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కలకోట రాజగోపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ పక్షపాతిగా దాదాపు 40 సంవత్సరాలు ఉద్యమమే ఊపిరిగా ఉన్నటువంటి మాణిక్య రెడ్డి కి ప్రథమ ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పులిపాటి మురళి, ప్రధాన కార్యదర్శి సోమ సత్తిరెడ్డి, జిల్లా ఆడిట్ సభ్యులు గుజ్జ బాలయ్య, జిల్లా పత్రిక కన్వీనర్ పిల్లి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : మహబూబ్‌నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాణిక్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి కోరారు శుక్రవారం మండలంలో వివిధ పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్యకర్తగా పనిచేస్తూ, నిబద్ధతతో ఉపాధ్యాయులకు సేవ చేస్తున్న మాణిక్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ రెడ్డి,అనురాగ్, సోమిరెడ్డి,శంభులింగా రెడ్డి,అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : ఉపాధ్యాయ సంక్షేమం కోసం నిరంతరం పోరాడే టీఎస్ యుటిఎఫ్ మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ ఉపాధ్యాయులను కోరారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బోజన విరామ సమయంలో మెరుపు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాణిక్ రెడ్డి తన సర్వీస్ మొత్తం విద్యారంగ సేవకే అంకితమయ్యారన్నారు. రిటైర్ అయి కూడా ఎలాంటి ఇతర వ్యాపారాల్లో పాల్గొనకుండా కేవలం విద్యారంగ సేవకే తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు అనిల్ కుమార్, మండల శాఖ ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, పూర్వ జిల్లా కార్యదర్శి మట్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.