Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘీభావం తెలిపిన సీఐటీయూ, ప్రజానాట్యమండలి
నవతెలంగాణ- రామన్నపేట
వీఆర్ఏ లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల హక్కుల సాధన సమితి పేరుతో మునుగోడు నుండి యాదగిరిగుట్ట వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర మూడవరోజు అయినా పాదయాత్ర శుక్రవారం రామన్నపేట మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా అధ్యక్షులు గొరిగే సోములు, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కందుల హనుమంతు పాదయాత్రకు స్వాగతం పలికి, సంఘీభావం తెలిపి వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి చైర్మెన్ ఆర్ విజరు, కన్వీనర్లు కావలి సత్యనారాయణ, నార్ల శ్రీనివాస్ ముదిరాజ్, ముదాం చిరంజీవి ముదిరాజ్ వారు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన 80 రోజుల సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల ప్రతినిధులతో చర్చలు జరిపి మునుగోడు ఎన్నికలు ముగియగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 12 న యాదాద్రి లో వీఆర్ఏల బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ పాదయాత్రలో వీఆర్ఏ హక్కుల సాధన సమితి కో చైర్మన్ లక్ష్మల్ల నరసింహారావు, లక్ష్మీనారాయణ, కో కన్వీనర్లు కూన రాజేందర్, కమిటీ సభ్యులు రత్నం, భాషమోని మల్లేష్, రాంబాబు, కిలారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.