Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆర్డీవో రాజేంద్రకుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.కాగా కార్యాలయానికి ఇన్చార్జి ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్, కొందరు సిబ్బంది సమయానికి కార్యాలయానికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపైన కార్యాలయానికి సమయానికి రావాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం పంచాయతీ రికార్డులను, నర్సరీ, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరును పరిశీలించారు.అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ పాటించాలని, ఆహారపదార్థాలను పరిశీలించారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషగిరిరావు, ఇన్చార్జి ఎంపిడిఓ బాణాల శ్రీనివాస్, విద్యాధికారి రవి, ఇన్చార్జి ఎంపీఓ జానయ్య, ఏపీఓ రవి, అర్ఐ సుందరిమట్టయ్య, కార్యదర్శి చంద్రశేఖర్, అంగన్వాడీలు ఊర్మిళ, విజయ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.