Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మున్సిపల్ పాలకమండలి భాగస్వాములై తిరుమలగిరి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవాలని శాసనసభ్యులు గాదరి కిషోర్కూమార్ అన్నారు.శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి బడ్జెట్‌పై చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటూ పట్టణ అభివృద్ధికి విస్తృతంగా కృషి చేయాలని కౌన్సిల్లో చర్చించి తీర్మానం మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.ఖర్చులను తగ్గించుకుంటూ, ఆదాయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉండేలా పాలక మండల సభ్యులు కృషి చేయాలని తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పన్నువసూలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిధులు 15 కోట్లా 38 లక్షలు మున్సిపల్ ఆదాయం ద్వారా నిధులు 2 కోట్లా 63 లక్షలు మొత్తం 18 కోట్లా 15 లక్షలా 16 వేల రూపాయలు అని తెలిపారు. 2023-24 లో తిరుమలగిరి మున్సిపల్ సొంత రాబడి కింద పన్నుల రూపంలో120.03 లక్షలు, అద్దెలు, ఫీజుల ద్వారా 69.21 లక్షలు, పారిశుధ్య విభాగం ద్వారా 8.72 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా 65.20 లక్షలు, మొత్తం రూ.263.16 లక్షల ఆదాయం అంచనా నమోదు చేయబడినదని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ల్యాండ్ బ్యాంకింగ్ ద్వారా ప్రభుత్వ స్థలాలను కేటాయించి ప్రభుత్వ భవనాలు మల్టీపర్పస్ స్టేడియం, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణాలకు త్వరలో స్థలాలను కేటాయించి భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు వార్డుల వారీగా ట్రైన్లు, సీసీరోడ్లు,విద్యుత్ స్తంభాల కొరకు శాసనసభ్యుల దృష్టికి తీసుకొని రాగా వెంటనే అంచనావేసి సంబంధిత అధికారులు నివేదిక అందించాలని ఆదేశించారు.మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైన పనులకు నిధుల కొరతలేదన్నారు.అధికారులు అంచనా వేసి ఇవ్వాలని తెలిపారు.అమృత పథకం ద్వారా 30 కోట్ల రూపాయలతో తిరుమలగిరి పట్టణ తాగునీటికోరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం మున్సిపాలిటీలోని వేజ్,నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణస్థలం, నూతన నిర్మాణం చేపట్టనున్న మున్సిపాలిటీ భవనస్థలం, పట్టణంలోని వార్డులలో పనులు చేపట్టనున్నడ్రయినేజీలను ఎమ్మెల్యే, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, మున్సిపల్ చైర్పర్సన్ రజినిరాజశేఖర్, కౌన్సిలర్లు, తహసీల్దార్లు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, కల్లెట్లపల్లి శోభన్‌బాబు పాల్గొన్నారు.