Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-సూర్యాపేట
మనువాదం మెజారిటీ ప్రజలకు చదువును నిషేధిస్తే నేటి ఈ నాగరిక సమాజానికి అక్షర దివిటి అందించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయిఫూలే అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు.ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నలంద జూనియర్ కళాశాలలో సావిత్రిబాయిఫూలే వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మెజారిటీ ప్రజలను అణిచి ఉంచడానికి అజ్ఞానంలో ఉంచడానికి మనుస్మృతి చదువును నిషేధించిందన్నారు.ఈ దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి మెజారిటీ ప్రజలకు చదువు నేర్పడానికి తుదిశ్వాస వరకు కృషిచేసిన సావిత్రిబాయిఫూలేను సమాజమంతా స్మరించుకోవాల్సి ఉందన్నారు.పేదలకు సామాజిక సేవ చేయడం,వారి జీవితాల్లో మమేకం కావడం ఆమె ప్రత్యేకత అన్నారు.నాడు సావిత్రిబాయిఫూలే అస్పృశ్యులు మహిళల చదువుపై ప్రత్యేకదృష్టి సారించిందన్నారు.ఆమె ఆశయాలకు తిలోదకాలిస్తూ నేటి కేంద్ర బీజేపీ సర్కార్ నూతన విద్యావిధానం పేరుతో దళితులు,పేదలను ఉన్నతవిద్యకు దూరం చేసే కుట్రలు చేస్తుందన్నారు.ఆ ముసుగులో మనువాదం ప్రవేశపెడు తుందన్నారు.ఆర్ఎస్ఎస్ మనువాదులు పేపర్ మీద గీసిన బొమ్మ మాత్రమే సరస్వతి అయితే, ఈ దేశ ప్రజలకు చదువు నేర్పిన అమ్మ సావిత్రిబాయిఫూలే అని కొనియాడారు.ఆమె తుది శ్వాసవిడిచే సమయంలో ప్లేగు వ్యాధి సోకిన వారికి వైద్య సేవలందిస్తూ అదే వ్యాధి ఆమెకు సోకి మరణించారని చెప్పారు.ఆమె స్ఫూర్తితో మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, మహిళాహక్కులు, చట్టాల అమలుకోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కొలిచలమ శ్రీనివాస్,కెేవీపీఎస్ జిల్లా నాయకులు కొండేటిఉపేందర్, కావేరి, సునీత,లక్ష్మీ, మానస, కల్పన,రజిత,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.