Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మైనారిటీల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషలక్ష్మీనారాయణ అన్నారు.శుక్రవారం పట్టణంలోని మెప్మాకార్యాలయంలో మైనార్టీ రుణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి మాట్లాడారు.ప్రభుత్వం మైనార్టీలు స్వయం ఉపాధి సౌకర్యాలు కల్పించుకునేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.బ్యాంకులతో రుణాలు ఇప్పించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి కి,యువతకు శిక్షణ, ఉపాధిని అందించటం, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం, వారి సామాజిక అభివృద్ధికి ,ఆర్థిక పరిస్థితి మెరుగు పడేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి,కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు,తీపిరిశెట్టిరాజు, ధరావత్ స్వామినాయక్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.