Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
గీత కార్మికులు తాటి చెట్టు పై నుండి పడి చనిపోతుండటంతో వారి రక్షణ కోసం ఉపయోగపడే పరికరం సేఫ్టీ మోకును కేజీకేఎస్ ఆద్వర్యంలో శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో గీత కార్మికుల సమక్షంలో పరీక్షించారు. ఈ సందర్భంగా సేఫ్టీ మోకు తో గుండ్లపల్లి గ్రామానికి చెందిన గుండ్లపల్లి కష్ణ ఆ పరికరాన్ని అమర్చుకొని తాటీిచెట్టు పైకి ఎక్కి కాళ్లను వదిలివేయడంతో అతను కింద పడకుండా సేఫ్టీ మోకు రక్షణ కల్పించింది.ఈ పరికరం కల్లు గీత కార్మికులకు చాలా ఉపయోగమని పరికరాన్ని పరీక్షించిన గీత కార్మికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు , సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుధా హేమెందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల ప్రమాదాలను నివారించాలని ఉద్దేశంతో కార్మికులకు సేఫ్టీ మోకులను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్త్తుందన్నారు. ప్రభుత్వానికి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ ,టాడి కార్పొరేషన్ చైర్మెన్ బుర్ర వెంకటేశం, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ , జిల్లా కమిటీ తరఫున.కల్లు గీత కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఎరుకల హెమెందర్ గౌడ్, సంఘం జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్షుడు కోల వెంకటేష్ గౌడ్. మండల ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ. గుండ్లపల్లి సొసైటీ అధ్యక్షులు గంధమల్ల ఉపేందర్.ఎనుగంటి మనోహర్. పర్వాత రోహణ శిక్షకుడు శేఖర్ బాబు. ఉస్మానియా రిసెర్చ్ స్కాలర్ కల్లూరి గిరిధర్.బోయపల్లీ నాగరాజు, ఎవరెస్టు శిఖరం అధిరోహించిన ఆనంద్ కుమార్, పెద్ద గౌడ్ దూసటి హరిశంకర్, గుండ్లపల్లి రాము, సుదగాని వెంకటేష్.గుండు నరసింహ,అనంతుల ఐలయ్య,అరే నగేష్, గుండ్లపల్లీ హరిబాబు, గుండ్లపల్లీ శేఖర్, గుండ్లపాల్లీ లింగం, తదితరులు పాల్గొన్నారు.