Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి రాష్ట్ర చైర్మెన్ ఆర్.విజరు
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి చైర్మెన్్ ఆర్.విజరు అన్నారు.శనివారం బీఆర్ఏల పాదయాత్ర. గుట్టకు వచ్చిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు ఎనిమిది నెలల నుండి అనేక రకాల పోరాటాలు చేశామని ,80 రోజుల సమ్మె చేశామని తెలిపారు. చలో అసెంబ్లీ నిర్వహించామని ఆ సందర్భంలో మంత్రి కేటీఆర్ సిఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఏ ప్రతినిధులతో చర్చల సందర్భంగా మునుగోడు ఎన్నికలు అవ్వగానే వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని మాట ఇచ్చారన్నారు. మునుగోడు ఎన్నికలు అవ్వగానే మరిచిపోయారన్నారు.సమస్యలను పరిష్కరించని కారణంగా ఎక్కడైతే మాట ఇచ్చి మర్చిపోయారో అదే మునుగోడు నుండి మరో పోరాటానికి సిద్ధమవ్వాలనే సంకల్పంతో ఈనెల 8న మహిళా దినోత్సవ సందర్భంగా మునుగోడు నుండి పాదయాత్ర ప్రారంభించి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చేరుకొని పాదయాత్ర ముగించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి దాసరి వీరన్న , కో చైర్మన్ లక్ష్మల్ల నరసింహారావ,ు కన్వీనర్లు కావలి సత్యనారాయణ నార్ల శ్రీనివాస్, ముదాం చిరంజీవి, కమిటీ సభ్యులు రత్నం, భాషమోని మల్లేష్, రాజ్ కుమార్ శ్రీనివాస,్ హైమద్ కిలారి దుర్గాప్రసాద్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.