Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కవితకు నంజరు బహిరంగ క్షమాపణ చెప్పాలి
- బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకష్ణారెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలదన్నేలా నేడు ప్రధాని మోడీ పాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకష్ణారెడ్డి అన్నారు. శనివారం మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూబీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతూ నాయకులనుభయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇతర పార్టీల నాయకులపై ఒత్తిడి, ప్రలోభాలకు గురి చేస్తూ బీజేపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని, ప్రలోభాలకు తలొగ్గి బీజేపీలో చేరిన అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులంతా పుణ్యాత్ములుగా మారిపోతారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో కులాలు, మతాలు, వర్గ, వర్ణ విభేదాలకు తావివ్వకుండా ఎవరి రాజకీయం వారు చేసుకునే స్వేచ్ఛ ఉందని, ప్రజల స్వేచ్ఛను హరించేలా కులమతాలను రెచ్చగొడుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై లేనిపోని ఆరోపణలు సష్టించి ప్రజల్లో బీఆర్ఎస్ కు ఉన్న ఆదరణను దెబ్బకొట్టే కుట్ర పన్నుతున్నారన్నారు. బీఆర్ఎస్ కు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, కవితపై మోపిన ఆరోపణలు అవాస్తవమని తేలి కడిగినముత్యంలా కవిత బయటకు వస్తారన్నారు. ఎంపీగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజరు ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. దేశ మహిళా లోకం సిగ్గుపడేలా సంజరు వ్యాఖ్యలు ఉన్నాయని, సంజరు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నిరసనలను ఉధతంచేయడంతో పాటు సంజరు ఇంటి ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్ రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, నాయకులు మలిపెద్ది రాంరెడ్డి, దబ్బెటి రమేష్ పాల్గొన్నారు.