Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని హనుమాన్ నగర్లో సుమిత్ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వారు నూతనంగా ఏర్పాటుచేస్తున్న టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్‌చేస్తూ 17,18 వార్డుల ప్రజలు శనివారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజుకు వినతిపత్రం అందజేశారు. ఇండ్ల మధ్య ఏర్పాటుచేస్తున్న టవర్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాలనీ ప్రజలకు ఆరోగ్యం, గుండె సంబంధిత వ్యాధులకు గురవుతారని తెలిపారు. తక్షణమే టవర్ పనులు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపగోని లక్ష్మణ్‌గౌడ్, కామిశెట్టి శైలజభాస్కర్, ప్రజలు తడక చంద్రకిరణ్, పెద్దగోని రమేశ్, మెట్టు రామచంద్రారెడ్డి, భీమిడి రాంరెడ్డి, కుంటల శశికాంత్, కాసోజు కిరణ్, దోటి శివ, ఇట్టగోని మురళి, బన్ని, కవిత, విజయ, రమ్య పాల్గొన్నారు.