Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాపేట: ఎమ్మెల్సీ చేసిన కవితపై బండి సంజరు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద శనివారం బీజేపీి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాకిర్తి రాజిరెడ్డి ఎంపీపీ గోపగాని బాలమణి విజిలెన్స్ కమిటీ మెంబర్ సంధిలా భాస్కర్ గౌడ్, నరసింహులు, పల్లె సంతోష్ గౌడ్ ,కరాటే బాలు ,వీరేశం, సిద్ధులు, బిక్షపతి, మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం ,ఎడ్ల బాలలక్ష్మి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజరు దిష్టిబొమ్మను 65వ నెంబర్ జాతీయ రహదారిపై దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, దేవరపల్లి గోవర్థన్‌రెడ్డి, పాశం సంజరుబాబు, తాడూరి పరమేశ్, బొడిగె బాలకష్ణగౌడ్, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, కానుగు శేఖర్, ఉడుగు రమేశ్‌గౌడ్, కానుగు బాలరాజు, పస్తం గంగరాములు, కట్కూరి కిరణ్, నారబోయిన శంకర్ పాల్గొన్నారు.
ఆలేరు టౌన్: ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజరు వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో శనివారం రైల్వే గేట్ ఆవరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజరు దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు సీస మహేశ్వరి అద్వర్యంలో దహనం చేసి నిరసన తెలిపారు.అనంతరం బండి సంజరుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎమ్‌డి.ఇద్రిస్ అలీకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ ,మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ,ఆడెపు బాలస్వామి ,కుండె సంపత్ ,మొరిగాడి ఇందిర,కో ఆప్షన్ మెంబర్ బింగి లత, పిఎసిఎస్. వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ ,యాట జయ ,మొరిగాడి సుజాత ,విలాసాగర్ రేణుక ,ఆలేటి అరుణ ,జూకంటి భాగ్య ,పాము సువర్ణ ,తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు: ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారంమున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బండి సంజరు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మెన్‌్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, బీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షుడు మల్లం అనిత, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ మారయ్య, కౌన్సిలర్లు దబ్బెటి విజయ, మలిపెద్ది రజిత, ఎండి.షాహినుల్తాన, నాయకురాళ్లు దబ్బెటిశైలజ, మొగుళ్ల అనురాధ, కట్టా ఇంద్రాజ్యోతి, పైళ్ల సాత్విక, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాంపాక నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.