Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపటేల్ రమేశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
పోరాట యోధులస్ఫూర్తితో ప్రజా వ్యతిరేక పాలకులు మోడీ, సీఎంకేసీఆర్లను గద్దెదించి రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాట స్ఫూర్తితో ముందుకెళ్దామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు.హాత్ సే హాత్ జోడో అభియాన్ స్ఫూర్తితో సూర్యాపేట నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చేపట్టిన మహాపాదయాత్రలో భాగంగా 23 వ రోజు మండలంలోని అక్కలదేవిగూడెం గ్రామం నుండి చందుపట్ల గ్రామానికి మహాపాదయాత్ర చేరుకుంది.పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యల వింటూ నేనున్నానని భరోసానిస్తూ ముందుకెళ్తున్నారన్నారు.యాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.భూమికోసం, ప్రజల విముక్తి కోసం పోరాడిన దేవులపల్లి వెంకటేశ్వర్రావు జన్మనిచ్చిన చందుపట్ల చైతన్యవంతమైన గ్రామం అన్నారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు జన్మనిచ్చిన చందుపట్ల గ్రామం నుంచె పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక పాలకులు మోదీ,కేసీఆర్‌లను గద్దె దించడానికి సమరశంఖం పూరిద్దామన్నారు.రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి చేస్తున్న పోరాట స్ఫూర్తితో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడుదామన్నారు.తెలంగాణ సెంటిమెంటుతో రెండుసార్లు గెలిచిన జగదీశ్‌రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. సూర్యాపేట నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడుతామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలనిప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీచైర్మెన్ ముదిరెడ్డి రమణారెడ్డి,గోదాల రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకన్ననాయక్, కౌన్సిలర్లు షఫీఉల్లా, వెలుగువెంకన్న,నామ ప్రవీణ్,వల్దాస్ దేవేందర్,యూత్ నాయకులు ఫారూక్, మండల నాయకులు ఎల్క నర్సిరెడ్డి,కొండ వెంకన్న, శివ, తారాసింగ్, కాంగ్రెస్ మండలనాయకులు పాల్గొన్నారు.