Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
పాత్రికేయులకు శిక్షణ ద్వారా మెలకువలు సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదారి కిషోర్‌కుమార్ తెలిపారు.శనివారం పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో గల ఆడిటోరియంలో మీడియా అకాడమీ వారి ద్వారా రెండు రోజులపాటు నిర్వహించనున్న పాత్రికేయుల శిక్షణాతరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.పాత్రికేయులకు ఇలాంటి శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న అనేక మార్పుల కారణంగా వస్తున్న అనేక మార్పుల కారణంగా పాత్రికేయులు ఆలోచన చేయాల్సిందని చెప్పారు.తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిజం ప్రత్యేకమైన వత్తి అని అన్నారు. రాష్ట్రంలో 24800 మందికి అక్రిడిటేషన్ కార్డులు అందజేసిన ఘనత మనదేనన్నారు. మీడియా అక్కడ మీ వారు ఇస్తున్న కిట్టిలో 12 రకాల పుస్తకాలు ఉన్నాయని, క్షుణ్ణంగా చదివి మెళకువలు నేర్చు కోవాలన్నారు.రెండు రోజులు జరిగే ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆధునిక జర్మలిజంపై పాత్రికేయులకు సమగ్రమైన అవ గాహన అవసరమని చెప్పారు.పాత, నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి అన్ని జిల్లాలలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు మీడియా అకాడమీ ద్వారా చర్యలు చేపట్టామన్నారు.పాత్రికేయంలో వేగం పెరిగిందని, మారుతున్న పరి స్థితులకు అనుగుణంగా పాత్రికేయులకు శిక్షణ తప్పనిసరి అని చెప్పారు. నాణ్యమైన వార్తలు ప్రజలకు చేరవేయడంలో శిక్షణా కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమా జానికి మనం వార్తలను అందించాలని చెప్పారు.కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు మీడియా అకాడమీ ద్వారా రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు.సమాజంలో జరిగిన జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా మెలకువలు, నైపుణ్యాలు నేర్చు కోవాలన్నారు. అనంతరం పత్రికల భాష తప్పొప్పులు దిద్దుబాటు అంశంపై చిల్ల మల్లేశం,సీనియర్ జర్నలిస్ట్ మఫిషియల్ ఇన్చార్జి వెలుగు నేర వార్తల అంశంపె,ౖ సీనియర్ జర్నలిస్టు బిటి గోవిందరెడ్డిలు పాత్రికేయులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు,జెడ్పీటీసీలు సంజీవ్‌నాయక్,జీడి భిక్షం, టీయూడబ్య్లూజే -143 జిల్లా అధ్యక్షులు వజ్జె వీరయ్య,టీడబ్య్లూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు అయితగాని రాంబాబుగౌడ్, జానయ్య,ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్యామ్‌సుందర్‌రెడ్డి, జర్నలిస్టు నాయకులు కందుకూరి యాదగిరి, గుండా శ్రీనివాస్ గుప్తా, భూపతి రాములు, చల్లా చంద్రశేఖర్, సిరికొండ సైదులు, బొజ్జ ఎడ్వర్డ్, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.