Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
అమరజీవి నందమూరి కోటేశ్వరావు ఆశయ సాధనకు పెంచికల్దిన్న యువత కషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.మండలంలోని పెంచికల్దిన్న గ్రామంలో జరిగిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నందమూరి కోటేశ్వరరావు ఆశయ సాధనకు యువత కషి చేయాలన్నారు.రానున్న కాలం కమ్యూనిస్టులదేనని, ప్రపంచ దేశాలన్నీ కమ్యూనిస్టు వైపు చూస్తున్నాయన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా,రైతు, కార్మిక,మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతున్నామన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 17 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు జనచైతన్య యాత్రలు చేపడుతున్నట్టు తెలిపారు .కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గడిని ఎనిమిదేండ్ల కాలంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచుతూ, పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా సీపీఐ(ఎం) తన పంథా కొనసాగిస్తుందన్నారు. ఈ నెల 17 నుండి 29 వరకు జరిగే జన చైతన్యయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26వ తేదీన నేరేడుచర్లలో జన చైతన్యయాత్ర సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.సభకు సంఘీభావంగా బైక్ ర్యాలీ ఉంటుందన్నారు.ర్యాలీని పార్టీ శ్రేణులు, అభిమానులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం గ్రామంలో పార్టీ సీనియర్ కార్యకర్త ఉప్పెల్లి చిన్నవెంకులు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబసభ్యుల్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, మండలకార్యదర్శి సిరికొండ శ్రీను, మర్రి నాగేశ్వరరావు, కుంకు తిరుపతయ్య,కట్టమధుబాబు, నందమూరిబాబురావు, పాలకూరి రాములమ్మ, మురళీ, అప్పారావు, బొప్పన.రాణమ్మ,అల్వాల శ్రీధర్, జీడిమెట్ల రవి, సట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.