Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీపీఐ(ఎం) ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు తొట్లమల్సూర్ ఆశయ సాధన కోసం పోరాటాలు ఉధతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.తొట్ల మల్సూర్ 24వ వర్థంతి సందర్భంగా శనివారం స్థానిక ఎంవీఎన్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం జరిగిన మహత్తర సాయుధ తెలంగాణ పోరాటంలో దళ కమాండర్‌గా పని చేసి రజాకార్లకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని పేర్కొన్నారు.సాయిధ పోరాటంలో పాల్గొని మూడేండ్ల పాటు గుల్బర్గాలో జైలుజీవితాన్ని సైతం అనుభవించారని తెలిపారు.అనేకమంది పేదలకు ప్రభుత్వ, పోరంబోకు, బంజరాయి భూములను పంచిన దాంట్లో మల్సూర్ పాత్ర మరువలేనిదన్నారు.ప్రజల సంపాదనను దోచుకొని గుర్రాల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న వారిని అడ్డుకొని ప్రజలకు పంచరని తెలిపారు.ఎర్రబాడు ప్రాంతాలలో దొరలు, జమీందారులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి అనేక పోరాటాలు నిర్వహించారని కొనియాడారు.నూతనకల్ జెడ్పీటీసీగా సీపీఐ(ఎం) నుండి గెలుపొంది చిల్పకుంట్ల కేంద్రంగా చేసుకొని అనేక ప్రజా సమస్యలను పరిష్కారం చేశారని పేర్కొన్నారు.సీపీఐ(ఎం)పై ఎన్ని నిర్బంధాలు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని పార్టీని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. గీత కార్మిక సంఘం తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి గీత కార్మికుల సమస్యల కోసం పనిచే పరిష్కారం చేశారని తెలిపారు. అనేక కూలి, భూమి పోరాటాలు నడిపి కూలి రేట్లు పెంచారని చెప్పారు. దళితులకు భూములు,ఇండ్ల స్థలాల పంపిణీలో తొట్ల మల్సూర్ పాత్ర మరువలేనిదని కొనియాడారు.తొట్ల మల్సూర్ స్ఫూర్తితో నేటి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతూ పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాన్ని రక్షించుకోవడం కోసం పార్టీ ఆధ్వర్యంలో జరిగే జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోటగోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం,వేల్పుల వెంకన్న, జె.నర్సింహారావు, వీరబోయిన రవి,చివ్వెంల మండల కన్వీనర్ బచ్చలకూరి రామ్‌చరణ్, రామ్‌చరణ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు శీలంశ్రీను, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి దేవరకొండ యాదగిరి ,రిటైర్డ్ తహసీల్దార్ పెరుమాళ్ళ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్: నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు గీత కార్మికుల, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగాని పోరాటం చేసిన అమరవీరుడు తొట్లమల్సూర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి అన్నారు.శనివారం మండలకేంద్రంలోని తొట్లమల్సూర్ స్మారక భవనంలో నిర్వహించిన మల్సూర్ 24 వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శంకర్‌రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంజపెళ్లి లక్ష్మయ్య ,కూసుసైదులు,బాణాల నర్సిరెడ్డి, బాలగాని సోమయ్య,బత్తుల శ్రీను,పోయిలపాక మధు తదితరులు పాల్గొన్నారు.