Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ పానకంటి వెంకటగిరి
నవతెలంగాణ-నల్లగొండ/హాలియా
ఈనెల 5న త్రిపురారం మండలం అంజన్నపల్లిలో జరిగిన ఎర్రగొల్ల నగేష్ (27) హత్య కేసును త్రిపురారం పోలీసులు ఛేదించారు. వివరాలను శనివారం హాలియా పోలీస్ స్టేషన్లో మిర్యాలగూడ డీఎస్పీ పానకంటి వెంకటగిరి వివరాలు వెల్లడించారు. ఈనెల ఐదున ఎర్రగొల్ల నగేష్, ఆయన తమ్ముడు ఎర్రగొల్ల సతీష్ ఇద్దరు కలిసి భోజనం చేసి ఒకే దగ్గర నిద్రించారు. ఆరోవ తేదీ తెల్లవారుజామున సతీష్ లేవడంతో ఆయన పక్కన పండుకున్న నగేష్ కనిపించలేదు. దీంతో సతీష్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చిన నగేష్ ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులు అదే రోజు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన కంచి గట్ల శ్రీనివాస్‌పై అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో పథకం ప్రకారం భార్యతో కలిసి నగేష్‌ను హత్య చేసినట్లు వివరించాడు. వెంటనే పోలీసులు శ్రీనివాస్ అతని భార్యని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. ఈ కేసును చేదించిన ఆలియా సీఐ గాంధీ నాయక్, ఎస్ఐ శోభన్‌బాబు, సిబ్బంది రవి, శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, రాములను డీఎస్పీ అభినందించారు.