Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-దేవరకొండ
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బండి సంజరు తెలంగాణ మహిళా సమాజాని కించపరుస్తూ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై శనివారం మహిళలు బండి సంజరు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ బండి సంజరు గుండు సంజరు, నత్తి నారాయణ నోరు ఫినాయిల్‌తో కడుకోవాలన్నారు. బండి నోటిని అదుపులో పెట్టుకోని మాట్లాడాలన్నారు. తెలంగాణ మహిళా సమాజానికి కించపరిస్తే మహిళలు బండి సంజరు బట్టలు ఊడదీసి కొడతారని తెలిపారు. బండి సంజరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, మహిళా అధ్యక్షురాలు చెరుపల్లి జయలక్ష్మి, పొన్నబోయిన భూదేవి సైదులు, తస్కిన్ సుల్తానా, రాష్ట్ర నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మెన రహతలి, వేముల రాజు, గుడిపల్లి కష్ణ ,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నకిరేకల్ : తెలంగాణ జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజరును అరెస్టు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. శనివారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆద్వర్యంలో బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే చిరుమర్తితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో బండి సంజరుపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేష్‌గౌడ్, నకిరేకల్, కేతెపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకటరెెడ్డి, పట్టణ అధ్యక్షుడు యల్లపురెడ్డి సైదారెడ్డి, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ అద్యక్షుడు బండి సంజరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు నాగలక్ష్మి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్ షహనాజ్ బేగం, సోయాబ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
డిండి : తెలంగాణ జాగతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజరు వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం బండి సంజరు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల సాయమ్మకాశన్న, ఎంపీటీసీ 2 భూషిపాక వెంకటయ్య, మేకల కాశన్న, బాధమోని శ్రీనివాస్‌గౌడ్, బలముల తిరుపతయ్య, కలీం, గుర్రం సురేష్, మేడమోని నిరంజన్, రషీద్, తండు శ్రీను, ఏసోబు, రామస్వామి, ప్రమీల, జానకి, అనసూయ, కష్ణమ్మ, రాములమ్మ, జయమ్మ, భూషిపాక అలివేలు, అన్వర్, వెంకటరమణ, బద్దెల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.