Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిట్యాలలో పర్యటించిన ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-చిట్యాలటౌన్
డ్రెయినేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం చిట్యాల పట్టణంలో ఆయన పర్యటించారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా పట్టణంలోని 4, 5 వార్డుల్లో పర్యటిస్తూ అభివద్ది పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఉదయం ఆరు గంటల నుండే మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, వైస్ చైర్మెన్ కురెల్ల లింగస్వామి, కమీషనర్ మందడి రామ దుర్గారెడ్డి, కౌన్సిలర్ జమాండ్ల జయమ్మ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి అన్ని వీధులు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్దిల సహాకారంతో అధిక నిధులు రాబట్టేందుకు కషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కష్ణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తేరేటిపల్లి హనుమంతు, పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, గంట శ్రీనివాస్‌రెడ్డి, కాకులారపు బొర్రారెడ్డి, షీలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.