Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కవితపై బండి సంజరు అనుచిత వ్యాఖ్యలను ఖండించిన గొంగిడి సునీత మహేందర్రెడ్డి
నవతెలంగాణ-ఆలేరుటౌన్
బీజేపీ నాయకులు కుట్రలు కుతంత్రాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ చిల్లర రాజకీయాలకు, చిల్లర చేష్టలకు బయపడే వారు తెలంగాణలో ఎవ్వరు లేరన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడేటప్పుడు బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. కేసీిఆర్ని, కవితని విమర్శించే స్థాయి నరేంద్రమోడీకి, సంజరుకి, బీజేపీ నాయకులకు లేదని మండిపడ్డారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న పార్టీ బీజేపేనని, పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, రానున్న ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పి పాతాళంలోకి దేశ ప్రజలు తొక్కేస్తారని హెచ్చరించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే సన్నాసులకు తగిన బుద్ధి చెబుతామని, తొందర్లోనే రాజకీయాలలో కనుమరుగయిపోతారని అన్నారు. కల్వకుంట్ల కవిత ఆమె బీఆర్ఎస్ తరపున పోటీ చేసినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే సొంతంగా తెలంగాణ జాగతి సంస్థ నిర్మించుకొని ఆ సంస్థ ద్వారా రాష్ట్రంలో ఉద్యమం నిర్వహించి మహిళలను జాగతి పరిచిందన్నారు. ఒక గొప్ప సంకల్పంతో జాగతి సంస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో కూడా ఒక చైతన్యాన్ని ఉద్యమబాట పట్టిన కవిత చరిత్ర తెలుసుకో బండి సంజరు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో వెళ్లిపోతుందని, జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ బజారు పాలు అయితారేమో అని భయంతోనే, కేసీఆర్ కూతురు మీద ఒక నింద వేసి టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.అరుపులకు భయపడే పరిస్థితి కవితకు లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్నపుడు ఆడవాళ్ల గురుంచి పార్లమెంట్లో అనేక సార్లు మాట్లాడారని గుర్తు చేశారు. వెంటనే మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీఏసీిఎస్ వైస్ చైర్మెన్ చింత కింది చంద్రకళ మురాహరి, బీిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు సీస మహేశ్వరి,వార్డు కౌన్సిలర్ మొర్తాల సునీత రమణారెడ్డి, కౌన్సిల్ సభ్యులు బింగి లత, మొరిగాడి సుజాత ,భాగ్య , మల్లమ్మ మహిళా సభ్యుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.