Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బఫ్ సిస్టంలో మార్చేసిన దేవస్థానం
- దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు
- తాత్కాలిక అన్నదాన సత్రం లో భక్తులకు ఇబ్బందులు
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం భక్తులకు ఏర్పాటుచేసిన అన్నదాన సత్రంలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.యాదాద్రి దేవస్థానంలో రోజుకు 500మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.కల్యాణం నిర్వహించే భక్తులకు దైవదర్శనంలో టోకెన్ తీసుకున్న భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుండి కొండ కింద అన్నదానసత్రంలో అన్నదానం చేపడతారు.
బఫ్ సిస్టం వలే అన్నదానం
భక్తులకు దైవసన్నిధిలో అన్నప్రసాదం స్వీకరించడం అంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భావిస్తారు.తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో వివాహాలలో ఏర్పాటు చేసే విధంగా బఫ్ సిస్టం వలే అన్నప్రసాదం వడ్డిస్తుండడంతో ఇలాగేనా అన్నప్రసాదం స్వీకరించేదని భక్తులు పెదవి విరుస్తున్నారు ఫ్యామిలీతో వచ్చే భక్తులు నేల మీద కూర్చుని తింటుండడంతో అక్కడ పడ్డ అన్నప్రసాదాలను ఇతర భక్తులు తోక్కుకుంటు వెలుతుండడంతో మిగిలిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
దెబ్బతింటున్న మనోభావాలు
దైవసన్నిధిలో అన్నప్రసాదం ఇష్టరితిన వడ్డిస్తుండడంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.కోట్ల రూపాయలతో అభివద్ధి చేసిన దేవాలయంలో దైవప్రసాదంగా భావించే అన్నప్రసాదాన్ని తాత్కాలిక ఏర్పాట్ల పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వడ్డించడం విమర్శలు దారితీస్తుంది. రూ.వందల కోట్లతో నిర్మాణం చేసిన ఆలయంలో అన్నప్రసాద వితరణ భక్తుల భక్తిభావం ద్వారా పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
పాలరాజు,స్థానిక భక్తుడు
అన్నదానంలో భక్తుల బాధలు వర్ణణాతీ తంగా ఉన్నాయి.చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు అన్నదానంలో మరింత ఇబ్బందులు పడుతున్నారు.కూర్చునేందుకు బల్లలు ఉన్న వాటిని భక్తులకు ఉపయోగించడం లేదు.ఇప్పటికైనా అన్నప్రసాదంలో ఇతర దేవస్థానాల్లో మాదిరిగా భక్తులకు అన్ని ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలి.