Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
సీపీఐ(ఎం)పై బీజేపీ చేస్తున్న దాడులను ప్రజాతంత్ర వాదుల ఖండించాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు.ఆదివారం మండలంలోని పుట్టపాక గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.త్రిపుర ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం కోసం వెళ్లిన సీపీఐ(ఎం) రాజ్యసభ పక్ష నేత ఎలమారం కరీం నేతత్వంలోని ప్రతిపక్ష ఎంపీల బందంపై అధికార బీజేపీ కార్యకర్తల దాడిని ఖండించాలన్నారు. త్రిపురలో మార్చి 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వామపక్ష , ప్రతిపక్ష నాయకులపై దాడులు పెరిగాయన్నారు.దీనిలో పొలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు.పదిరోజుల్లోనే వెయ్యికి పైగా దాడులు జరిగాయని వందల మంది కార్యకర్తలు గాయాల పాలయ్యారన్నారు.700 పైగా ఇండ్లు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.దాడికి పాల్పడిన వారిపైన కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, బీజేపీ ప్రభుత్వం అనుచరులుగా పనిచేయడం జరిగిందన్నారు.అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాలల్లో మహిళల మీద దళితుల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు విపరీతంగా పెరిగాయన్నారు.మతోన్మాద భావజాలాన్ని అమలు జరపాలని కుట్ర దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు.మనుషుల మధ్య వైషమ్యాలు పెంచి పోషిస్తుందన్నారు.ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) బీజేపీ ప్రజా వ్యతిరేక విడనాడాలని .ప్రజలకు వివరిస్తూ ఈనెల 17 నుండి 29 వరకు జన చైతన్య యాత్రలు చేస్తున్నామన్నారు.ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాసచారి, గడ్డం వెంకటేష్,పిట్ట రాములు, శివసెట్టి లాలయ్య, వర్కాల శేఖర్, రావిరాల మల్లేష్, పంకెర్ల యాదయ్య, కొంగరి మారయ్య పాల్గొన్నారు.