Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 కేసులు, 184 వాహనాలు స్వాధీనం
- రాచకొండ భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర
నవతెలంగాణ-భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో భువనగిరి రాచకొండ కమిషనరేట్ డీసీపీ రాజేష్‌చంద్ర ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు.జిల్లావ్యాప్తంగా వాహనాలకు నెంబర్‌ప్లేట్స్ లేని వాటిని, తప్పుడు నెంబర్‌ప్లేట్స్ గల వాహనాలను ఎక్కువగా రోడ్లపై తిరుగుతున్నందున వాహనాలను తనిఖీ నిర్వహించార న్నారు.నెంబర్‌ప్లేట్స్ లేని వాహనాలు, నెంబర్ సక్రమంగా లేనివి, నెంబర్ ట్యాంపరింగ్ గలవి, నెంబర్ తుడిచివేసిన వాహనాలపై స్పెషల్ డ్రైవ్ లో 124 కేసులు నమోదు కాగా, 184 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.వాహనాల పత్రాలను పరిశీలించిన తర్వాత వాహన నెంబర్ప్లేట్కు సరిచూసి వాటిని నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలను గురించి కౌన్సెలింగ్ ఇచ్చి, తర్వాత వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మోటార్ వెహికల్ చట్టం 1988 నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ వాహనానికి సంబంధించిన చెల్లుబాటయ్యే పత్రాలు,వాహనం ముందు వెనకవైపు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం సరైన నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు.లేనిపక్షంలో అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.వెహికల్ తనిఖీ చేసే సమయంలో యాదాద్రి భువనగిరి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు తమ వాహనాలు సరైన నెంబర్ప్లేట్లను కలిగి ఉండాలని, లేనిపక్షంలో వారిపై సెక్షన్ 420 ఐపీసీ కింద ఫేస్బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.