Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరిరూరల్: ఆశాలకు ఏఎన్సీల టార్కెట్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని,ఆశాలకు పని ఒత్తిడి తగ్గించాలని, పిక్సిడ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అద్యక్షులు కల్లూరి మల్లేశం, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి కసగొని లలిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం ఆశా వర్కర్స్ యూనియన్ భువనగిరి మండల పీహెచ్సీ కమిటీ సమావేశం పీహెచ్సీ యూనియన్ అధ్యక్షురాలు పల్లెపాటి జ్యోతి అధ్యక్షతన నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశావర్కర్ల చేత వెట్టి చేయించు కుంటున్నారని విమర్శించారు .ప్రతి ఆశా కార్యకర్త భువనగిరిటౌన్లో ప్రతినెలా ఎనిమిది ప్రెగెన్సీల కన్పర్మేషన్ చేపించాలని టార్గెట్స్ పెట్టి వేధిస్తున్నారని, ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఆశావర్కర్లకు కనీస వేతనం ఇవ్వకపోగా ప్రతినెలలో మీటింగ్ల పేరుతో కంటివెలుగు పేరుతో మండలకేంద్రాలకు,దూర ప్రాంతాలకు తిప్పుతూ ప్రయాణచార్జీలు ఇవ్వడం లేదని,మరో వైపు వివిధ రకాల రికార్డ్స్ రాయమంటున్నారు. కానీ స్టేషనరీ ఖర్చులు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పందించి టీఏలు,స్టేషనరీ ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గతంలో నిర్వహించిన సర్వేలకు డబ్బులు ఇవ్వలేదని,వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆశాలకు పనిభారం తగ్గించాలని, సెలవులు వర్తింపజేయాలని, కనీసవేతనం ఇవ్వాలని, లేనిపక్షంలో సీఐటీయూ పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆశా యూనియన్ బొల్లెపల్లి పీహెచ్సీ అధ్యక్షురాలు పల్లెపాటి జ్యోతి, జిల్లా కోశాధికారి పుష్ప,నాయకురాలు పావని, సుజాత, ప్రమీల, అయిలమ్మ, అనిత, జయమ్మ, పావని పాల్గొన్నారు.